గోదావరిలో నిలిచిపోయిన బోటు.. తప్పిన పెను ప్రమాదం

by Vemula.Srinu Prasad |

గోదావరిలో నిలిచిపోయిన బోటు.. తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: పాపికొండల(Papikondalu Tour) పర్యటనలో షాకింగ్ ఘటన జరిగింది. 89 మంది పర్యాటకులతో వెళ్తున్న బోటు(Boat) ఒక్కసారిగా గోదావరి(Godavari)లో నిలిచిపోయింది. దేవీపట్నం సమీపం(Devipatnam Near)లో బోటులో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ మేరకు అధికారులు, నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. పర్యాటకులను వెంటనే మరో బోటులో సురక్షితంగా తరలించారు. దీంతో పర్యాటకులు ఊపరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై విషయం తెలుసుకున్న అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు నదిలో నిలచిపోయిన బోటులో మరమ్మతులు చేస్తున్నారు.

Next Story