కమ్యూనిస్టులు కంట్రీకి నీచులు: సోము వీర్రాజు వివాదస్పద వాఖ్యలు

by Vemula.Srinu Prasad |

కమ్యూనిస్టులు కంట్రీకి నీచులని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వివాదస్పద వాఖ్యలు చేశారు. విశాఖ జిల్లా భీమిలిలో బీజేపీ కార్యాలయంతో పాటు “మన ఊరు – మన జెండా” కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ..

కమ్యూనిస్టులు కంట్రీకి నీచులు: సోము వీర్రాజు వివాదస్పద వాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కమ్యూనిస్టులు(Communists) కంట్రీకి నీచులని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు(BJP MLC Somu Veerraju) వివాదస్పద వాఖ్యలు చేశారు. విశాఖ జిల్లా భీమిలి(Bhimili)లో బీజేపీ కార్యాలయం(BJP office)తో పాటు “మన ఊరు – మన జెండా” కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టులపై నిప్పులు చెరిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) విషయంలో ప్రైవేటీకరణ లేకపోయినా కమ్యూనిస్టులకు మేత అందక నిరహార దీక్షలు చేస్తున్నారని సోము వీర్రాజు విమర్శలు చేశారు.

47 వసంతాలు పూర్తి చేసుకున్న బీజేపీ

ఇక 47 వసంతాలు పూర్తి చేసుకున్న బీజేపీ ప్రస్థానం దేశ సేవ, సుశాసనం, అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతోందన్నారు. ఈ స్ఫూర్తిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే సంకల్పంతో “మన ఊరు – మన జెండా” కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, సేవా కార్యక్రమాలు ప్రజల్లో మరింతగా వ్యాప్తి చెందేలా, ప్రతి గ్రామంలో BJP జెండా ఎగురవేయడం ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం, ప్రజల్లో విశ్వాసం పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని సోము వీర్రాజు చెప్పారు.

Next Story