బీజేపీని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోము.. ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |

బీజేపీని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోము.. ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

బీజేపీని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోము.. ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పాలిటిక్స్‌(AP Politics)లో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి(BJP MLA Parthasarathi) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి మంచి రోజులు వచ్చాయని అన్నారు. ఇక నుంచి ఎవరూ బీజేపీని తక్కువ చేసి మాట్లాడటానికి వీళ్లేదని.. అలా ఎవరైనా మాట్లాడితే చూస్తూ ఊరుకోము అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో తమ పార్టీకి పదవులు వచ్చినా.. రాకపోయినా, అవమానం చేసినా మా జీవితం బీజేపీకి అంకితం అని అన్నారు. మోడీ నాయకత్వాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో చూపించామని అన్నారు. భారత్‌ వైపునకు ఏ దేశం కన్నెత్తి కూడా చూడకుండా మోడీ చేశారని తెలిపారు. ప్రపంచం ఎదుట భారత్.. స్ట్రాంగ్ దేశంగా కనిపిస్తుందంటే అందుకు కారణం నరేంద్ర మోడీనే అని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt) నిరుద్యోగులు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు అంతా సంతోషంగా ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించడం ఎవరి వల్లా కాదని అన్నారు.

Next Story