పుట్టుకతోనే నేను ధనవంతుడిగా పుట్టాను.. BJP MLA అభ్యర్థి సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు

by GSrikanth |

పుట్టుకతోనే తాను ధనవంతుడిగా పుట్టానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.

పుట్టుకతోనే నేను ధనవంతుడిగా పుట్టాను.. BJP MLA అభ్యర్థి సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పుట్టుకతోనే తాను ధనవంతుడిగా పుట్టానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. జీవితంలో ఎంతో కష్టపడి పైకి వచ్చానని.. ఎవరికీ అన్యాయం చేయలేదని అన్నారు. ఆనాడు చంద్రబాబు మోడీని వ్యతిరేకించడాన్ని తాను తప్పుబట్టినట్లు చెప్పారు. బీజేపీలో చేరకముందు తనపై ఎన్ని కేసులు ఉన్నాయో.. ఇప్పుడు కూడా ఆ కేసులన్నీ అలాగే ఉన్నాయని అన్నారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తనపై కేసులు పెట్టినట్లు నిరూపించాలని ప్రత్యర్థులకు సవాల్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉందన్నారు. ప్రస్తుతం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించే పనిలో తాను ఉన్నట్లు చెప్పారు. ప్రజల ఆశీస్సులు తనపై ఉన్నాయని.. తప్పకుండా గెలిచి తీరుతానని ప్రకటించారు. ఐదేళ్లలో ఏపీకి ఎవరూ సాయం చేయని విధంగా కేంద్రం చేసిందని అన్నారు. తాను పోటీ చేయబోయే విజయవాడ వెస్ట్‌లో చరిత్ర సృష్టించబోతున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story