- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వార్తల్లో నిలవడానికే పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ విమర్శలు.. బీజేపీ నేత కౌంటర్
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) వరుస విమర్శలు చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) వరుస విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు రాజకీయ పరిపక్వత లేదని.. అదృష్టవశాత్తు డిప్యూటీ సీఎం అయ్యారని తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. అంతేకాదు.. పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తులో ఉండటాన్ని ముంబయి లోకల్ ట్రైన్ జర్నీతో పోల్చారు. సొంత నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతకు ముందు హిందీ భాష, తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై కూడా పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి(Vishnuvardhan Reddy) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
‘‘బీజేపీ పార్టీపై నిత్యం విమర్శలు చేయడం మీ పని. నేడు పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేయడం వార్తల్లో నిలవడానికే తప్ప.. మరొకటి కాదు. అసలు ప్రజలకు మీరు చేసిందేమిటి.. ఏం సాధించారని పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. మీరు రాజకీయాల్లోకి వచ్చారు, ఎంపీ పోటీ చేశారు, మీరు ఏం సాధించారు?, ఇకనైన విమర్శలు మానుకోండి. బీజేపీ, జనసేన మీకు అండగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉండండి’ అని విష్ణువర్దన్ రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.






