'దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే'

by GSrikanth |   (  Updated:2023-01-03 05:36:31  IST  )

రోడ్లపై సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై విపక్షాలు మండిపడుతున్నాయి.

దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్లపై సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వ జీవోపై విమర్శలు చేశారు. సభలు, సమావేశాల నిర్వాహణపై జీవో విడుదల సరికాదని హితవు పలికారు. దుర్ఘటనలు జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. సభలు, సమావేశాలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సభల విషయంలో అధికార పార్టీకి ఒక రకంగా, విపక్షాలకు ఒక రకంగా వ్యవహరించొద్దని కోరారు.

Also Read..

Chandrababu ఎఫెక్ట్: AP government సంచలన నిర్ణయం

Next Story