- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డి అందుకే అలా అన్నాడు.. బీజేపీ నేత సోము వీర్రాజు హాట్ కామెంట్స్
బీజేపీ నేత సోము వీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది కేవలం ఆ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికే అని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ నేత సోము వీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది కేవలం ఆ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికే అని అన్నారు. రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా ఆపుతామని రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఇచ్చిన హామీ అవాస్తవం అని స్పష్టం చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడే 3,400 కోట్ల నిధులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు కేటాయించారన్నారు. జగన్ అధికారంలో ఉండగానే లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయాలని కొంతమంది కోర్టుకు వెళ్లారని చెప్పారు.
దానికి మూడేళ్లు జగన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ సమస్య వచ్చిందన్నారు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతూ.. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాను చేసిన విజ్ఞప్తి మేరకే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారన్నారు. కానీ రేవంత్ వ్యాఖ్యలను వెంటనే ఏపీ ప్రభుత్వం ఖండించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోలేదని స్పష్టం చేసింది. మరోవైపు వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.






