- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీటీడీలో మరో భారీ స్కామ్.. విజిలెన్స్ ఎస్పీకి పక్కా ఆధారాలు..!
తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీ స్కామ్ జరిగిందని, శ్రీవారి తులాభారం నగదును కొట్టేశారని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Davastanam)లో భారీ స్కామ్ జరిగిందని, శ్రీవారి తులాభారం నగదు(Srivari Tulabharam Cash)ను కొట్టేశారని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి(BJP leader Bhanu Prakash Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పక్కా ఆధారాలను విజిలెన్స్ ఎస్పీకి అందజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు. పరకామణి చోరీ, కల్తీ నెయ్యి కేసులో పాటు తులాభారం నగదు దొంతనం కేసును ఛేదించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో పని చేసిన ఉన్నతాధికారులు, విజిలెన్స్ సిబ్బందిని సైతం విచారించాలని చెప్పారు. తాను సమర్పించిన ఆధారాల ప్రకారం 2019-2024 వరకూ టీటీడీలో జరిగిన అక్రమాలను వెలికితీయాలన్నారు.
టీటీడీ(TTd)ని గత ప్రభుత్వం ధనార్జనగా మార్చిందని, శ్రీవారి ఖజానాకు గంటి కొట్టిందని భాను ప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల కానుకల్లో సగం కొట్టేసి మిగిలిన సగాన్ని లెక్కల్లో చూపించారని ఆరోపించారు. పరాకమణిలో చోరీ చేసిన ఉద్యోగిని చెట్టు కింద పంచాయితీ చేసి బేషరతుగా విడిచిపెట్టడం లాంటివి చూస్తే శ్రీవారి ఆభరణాలనూ చోరీ చేసి ఉంటారేమోననే అనుమానం కలుగుతుందన్నారు. ఈ చోరీలన్నింటిపై విచారణ జరపాలని భాను ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.






