బీజేపీలో పదవులు.. ఏపీ అధ్యక్షుడు మాధవ్ సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

గోదావరి జిల్లాల్లో చాలా గెలుపులు నమోదు చేసిన చరిత్ర బీజేపీకి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు...

బీజేపీలో పదవులు.. ఏపీ అధ్యక్షుడు మాధవ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: గోదావరి జిల్లాల్లో 27 శాతం ఓటింగ్ వచ్చి చాలా గెలుపులు నమోదు చేసిన చరిత్ర బీజేపీకి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. కాకినాడలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న అభినందన సభలో ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా మాధవ్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపక్షాలు ఊహించని ఫలితాలు బీజేపీ నమోదు చేసిందని, కొనసాగించిందని చెప్పారు. బీజేపీలో పదవులు అలంకారం కాదని, ఇది ఒక బాధ్యత అని మాధవ్ చెప్పారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి అంటే పూర్తి స్థాయిలో పర్యటన, సంస్ధాపరమైన పనిలో నిమగ్నమై ఉండాలని మాధవ్ సూచించారు. పని భారం కూడా అధికంగానే ఉంటుందని, అటువంటి బాధ్యతలు సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న‌కు ఇవ్వడం జరిగిందన్నారు. పార్టీలో సుదీర్ఘకాలం పని చేయడమే కోరుకుంటే పదవులు రావన్నారు. బ్రాహ్మణ సమాజం రాజకీయాలకు దూరంగా ఉంటోందని, బీజేపీలోకి రావాలని మాధవ్ పిలుపు ఇచ్చారు. బిజెపి జాతీయ వాద దృక్పథంతో ముందుకు వెళుతోందని, సోము వీర్రాజు సుధీర్ఘ కాలం పని చేశారని, రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారని గుర్తు చేశారు. పాకా సత్యనారాయణ రాజ్యసభ సభ్యుడు అయ్యారంటే సుదీర్ఘ కాలం పార్టీలో పని చేయడం వల్లేనని మాధవ్ పేర్కొన్నారు.

Next Story