అభిమానం పీక్స్.. వినూత్న రీతిలో లోకేష్ కి బర్త్ డే విషెస్

by Disha Web Desk 3 |
అభిమానం పీక్స్.. వినూత్న రీతిలో లోకేష్ కి బర్త్ డే విషెస్
X

దిశ వెబ్ డెస్క్: ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పుట్టిన రోజు. దీనితో రాష్ట్రవ్యాప్తంగానే కాదు అమెరికా లోనూ లోకేష్ పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక ఓ అభిమాని నారా లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన తీరు లోకేష్ కి మాత్రమే కాదు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా లోకేష్ అభిమాని అయిన T.N.S.F అధ్యక్షడు ప్రణవ్ గోపాల్ అందరిలా కాకుండా తన అభిమాన నాయుడికి వినూత్న రీతిలో బర్త్ డే విషెస్ తెలపాలి అనుకున్నారు .

అందుకు అతను స్కూబా డైవింగ్ ను ఎంచుకున్నారు. స్కూబా డైవింగ్ ద్వారా విశాఖపట్నం లోని సముద్ర గర్భం లోకి వెళ్లి అక్కడ నారా లోకేష్ చిత్ర పటాన్ని ప్రదశించి నారా లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి లోకేష్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన ప్రణవ్ గోపాల్ తనకు నారా లోకేష్ పైన ఉన్న అభిమానంతోనే తాను ఆ సాహసానికి ఒడిగట్టినట్టు తెలిపారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత వారసుడి జన్మదిన వేడుకలు విదేశాల్లోనూ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

అమెరికా లోని న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద మన్నవ మోహనకృష్ణ యూత్ ఆధ్వర్యంలో లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా మన్నవ మోహనకృష్ణ యూత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి లోకేష్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ క్రమంలో జై లోకేష్ , జై మన్నవ అంటూ అభిమానులు చేసిన నినాదాలు ప్రఖ్యాత ట్రైం స్క్వేర్ వద్ద మారుమోగాయి. ఇక కుప్పం లోనూ లోకేష్ పుట్టిన రోజు వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా కుప్పంలో ప్రత్యక పూజలు, పాలాభిషేకాలు, రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Next Story

Most Viewed