- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bird Flu : ఏపీలో మరో కలకలం .. ఆ చేపలు తినడంపై భయాందోళన
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల(Two Telugu States) ప్రజలను బర్డ్ ఫ్లూ(Bird Flu) వణికిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల(Two Telugu States) ప్రజలను బర్డ్ ఫ్లూ(Bird Flu) వణికిస్తోంది. ఇప్పటికే లక్షలాది కోళ్ళు బర్డ్ ఫ్లూ బారిన పడి మరణించగా.. తాజాగా కోళ్ళ ఫాంలో పని చేసే వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్టు తేలింది. ఇక బర్డ్ ఫ్లూ భయంతో రెండు రాష్ట్రాల్లో చికెన్ ధరలు(Chiken Prices) భారీగా పడిపోయాయి. అయితే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇస్తున్నా.. ప్రజలు చికెన్, గుడ్లు కొనడానికి ముందుకు రావడం లేదు. అయితే ఈ వ్యాధి తీవ్రంగా ప్రబలిన ఏపీ(AP)లోని ఉభయ గోదావరి జిల్లాల్లో(Godavari Districts) ప్రభుత్వం రెడ్ అలర్ట్(Red Alert) ప్రకటించింది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రకటన జారీ చేసింది. ఏపీలోని ఆయా జిల్లాల్లో ఓవైపు బర్డ్ ఫ్లూ కలకలం కొనసాగుతుండగానే.. మరో కొత్త కలకలం రేగింది. బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను చేపల చెరువుల్లో పెంచుతున్న చేపలకు దాన(Fisheries Food)గా వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురం చెరువుల్లో పెంచుతున్న చేపలకు, రొయ్యలకు కోళ్ళ మాంసాన్ని ఆహారంగా ఇస్తున్నట్టు వార్తలు దుమారం రేపుతున్నాయి. దీంతో చేపలు, రొయ్యలు తినాలా వద్దా అనే సందిగ్ధంలో పడిన ప్రజలు.. ఇపుడు చికెన్ తోపాటు, చేపలు రొయ్యలు కూడా కొనడం మానేశారు. కాగా ఈ వ్యవహారంపై ప్రభత్వ అధికారులు ఇంతవరకు స్పందించలేదు.






