బైక్ ప్రమాదం.. వైసీపీ నేత సాయం

by Thanuru Gopichand |

నెల్లూరు జిల్లాలోని మట్టెంపాడు (Mattempadu) వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైకులు ఢీకొనడంతో (Bike Accident) ఈ ప్రమాదం జరిగింది.

బైక్ ప్రమాదం.. వైసీపీ నేత సాయం
X

దిశ, వెబ్ డెస్క్ : నెల్లూరు జిల్లాలోని మట్టెంపాడు (Mattempadu) వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైకులు ఢీకొనడంతో (Bike Accident) ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మట్టెంపాడు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదుగా ప్రయాణిస్తూ ఢీకొన్నాయి. ఈ క్రమంలో బైకుపై ప్రయాణిస్తున్నవారు గాయాలపాలయ్యారు. ఒక బైకుపై ప్రయాణిస్తున్న డేగపూడి గ్రామస్తులకు తీవ్ర గాయాలయ్యారు. ఈ క్రమంలో వైసీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత (Kakani Poojitha) అటుగా ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని గమనించారు. వెంటనే వారికి సాయం చేసేందుకు కారును నిలిపారు. అనంతరం కారు నుంచి దిగి గాయపడిన వారిని పరామర్శించారు. వారికి వైద్యం సహాయం అందేలా చూడాలని భావించి ఆంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. అయితే ఆంబులెన్స్ రాకకు ఆలస్యం అవుతుండడంతో ఆమె సత్వరమే స్పందించారు. తీవ్రంగా గాయపడినవారు మరింత ఇబ్బంది పడక ముందే వారిని ఆసుపత్రి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో క్షతగాత్రులను తన కారులో ఎక్కించుకొని ఆసుపత్రికి బయలుదేరారు. ఆంబులెన్సులో క్షతగాత్రులను తీసుకెళ్తున్న క్రమంలో ఆంబులెన్స్ దారి మధ్యన ఎదురుపడింది. దీంతో వెంటనే వారిని ఆంబులెన్సులోకి మార్చారు. వారికి మెరుగైన చికిత్సను అందించాలని ఆంబులెన్స్ సిబ్బందికి సూచించారు. కాకాణి పూజిత సత్వర స్పందన పట్ల క్షతగాత్రులు హర్షం వ్యక్తం చేసి ధన్యవాదాలను తెలియజేశారు. స్థానికులు ఆమె చొరవను అభినందించారు.

Next Story