విడదల రజిని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్..!

by velandi.Saikiran |   (  Updated:2025-05-10 10:07:32  IST  )

ఆంధ్రప్రదేశ్ ( andhra pradesh) రాష్ట్ర మాజీ మంత్రి, వైసిపి కీలక నేత విడదల రజినికి ( Vidadala Rajini) ఊహించని ఎదురు దెబ్

విడదల రజిని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్..!
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ( andhra pradesh) రాష్ట్ర మాజీ మంత్రి, వైసిపి కీలక నేత విడదల రజినికి ( Vidadala Rajini) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే వరుస కేసులను ఎదుర్కొంటున్న విడదల రజిని.... ఇప్పుడు మరో చిక్కుల్లో పడింది. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి (Srikanth reddy) అరెస్ట్ అయ్యాడు.

విడదల రజిని కారులో ఉన్న శ్రీకాంత్ రెడ్డిని... పోలీసులు ( Ap Police) తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆమె కారును ఆపి, శ్రీకాంత్ రెడ్డి ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు అలాగే మాజీ మంత్రి విడదల రజినీకి తీవ్ర వాగ్వాదం జరిగింది. అసలు ఏ కేసులో శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేస్తున్నారో చెప్పాలని ఈ సందర్భంగా విడుదల రజిని కోరారు. ఈ సందర్భంగా మీ పైన కూడా కేసు పెడతామంటూ సీఐ సుబ్బారాయుడు (ci subbanadu) వ్యాఖ్యానించినట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది ఇలా ఉండగా... ఇప్పటికే మాజీ మంత్రి విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... పల్నాడు జిల్లాలో.. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని.. బెదిరించి అక్రమంగా డబ్బులు సంపాదించారని రజినీపై ఆరోపణలు వచ్చాయి. 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారని అభియోగం కూడా ఆమెపై ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమెపై కేసు నమోదు అయింది.


Next Story