- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking:వైసీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి అరెస్ట్
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.

X
దిశ,వెబ్‌డెస్క్: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రెండు నెలలుగా పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కాకాణిని పోలీసులు అరెస్టు చేశారు. కాకాణి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు హైదరాబాద్ లో రెండు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బెంగళూరులోనూ ఆయన కోసం పోలీసులు జల్లెడ పట్టారు. ఈ క్రమంలో ఎట్టకేలకు గుంటూరు రేంజ్ పోలీసులు కేరళలో కాకాణిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రేపు(సోమవారం) ఉదయం ఆయనను నెల్లూరు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. క్వార్ట్జ్ మైనింగ్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయన పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో ఆయన పై కేసు నమోదు కాగా, అక్రమ మైనింగ్ కేసులో ఏ4గా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు.
Next Story






