- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పులివెందులలో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన మంగలికృష్ణ ప్రధాన అనుచరుడు చంద్రశేఖర్ రెడ్డి
పులివెందులలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది...

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa District) పులివెందుల నియోజకవర్గం(Pulivendula Constituency)లో వైసీపీ(ycp)కి బిగ్ షాక్ తగిలింది. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(Jagan) అత్యంత సన్నిహితుడు మంగలికృష్ణకు ప్రధాన అనుచరుడు చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాదు ఆయనతో పాటు మరో 300 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ జెండా కప్పుకున్నారు. పులివెందుల ఇన్ ఛార్జ్ బీటెక్ రవి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో వీరంతా సైకిల్ ఎక్కారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించి వైసీపీ నేతలు, కార్యకర్తలను బీటెక్ రవి, శ్రీనివాసులరెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న రాష్ట్రాభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు వైసీపీ కార్యకర్తలు తెలిపారు. ఇక నుంచి టీడీపీ బలోపేతం కోసం పని చేస్తామని తెలిపారు. ఇక బీటెక్ రవి మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ జెండా ఎగరవేస్తామని దీమా వ్యక్తం చేశారు.






