గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ షాక్.. సొంత మండలాల్లో నో పోస్టింగ్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-13 03:00:15  IST  )

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ షాక్.. సొంత మండలాల్లో నో పోస్టింగ్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో ఉద్యోగుల బదిలీలు(Employees Transfers) ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు(Village and Ward Secretariat Employees) మాత్రం బిగ్ షాక్ ఇచ్చింది. మే 31, 2025 నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఐదేళ్లు పని చేసిన ఉద్యోగుల బదిలీలను తప్పని సరి చేసింది. అంతేకాకుండా సొంతమండలాలకు బదిలీ చేసేందుకు నిరాకరించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే బదిలీ అయిన ఉద్యోగుల వివరాలను జూన్ 10లోపు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌(HRMS Portal)లో అందుబాటులో ఉంచాలని ఆయా అధికారులను ఆదేశించింది. సచివాలయాల్లో నిర్దేశించిన దానికంటే అధికంగా ఉన్న ఉద్యోగులపైనా ఫోకస్ పెట్టింది. ఈ బదిలీల తర్వాత తదపరి ఆదేశాలిస్తామని వెల్లడించింది. అప్పటివరకూ ఉద్యోగులు ఉన్న చోటే కొనసాగించాలని సూచించింది. ఇందుకు సంబంధించిన అధికారాలను జిల్లా కలెక్టర్లకే అప్పగించింది. ఈ ప్రక్రియను జూన్ 30లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది.

బదిలీల్లో పలువురికి ప్రాధాన్యత

బదిలీల్లో పలువురికి ప్రాధాన్యత కల్పించింది. అంధులు, మానసిక వికలాంగులైన పిల్లలు కలిగిన తల్లిదండ్రులు, 2 ఏళ్లకు పైగా గిరిజన ప్రాంతాల్లో పని చేసిన ఉద్యోగులు, 40 శాతానికి పైగా అంగవైకల్యం, కారుణ నియామకాల్లో ఉద్యోగం పొందిన వారు, సమీప ప్రాంతాల్లోనే దంపతులకు బదిలీ.

కాగా జనాభా ఆధారంగా సచివాలయాలను ప్రభుత్వం మూడు కేటగిరిగా విభజించింది. ఏ కేటగిరిలో ఆరుగురు, బీ‌లో ఏడుగురు, సీలో ఎనిమంది ఉద్యోగులను ఉంచాలని నిర్ణయించింది. వీరిని స్పెసిఫిక్ పర్స్, జనరల్ పర్సస్ పంక్షనరీలుగా గుర్తించింది.

Next Story