- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: పల్నాడు జంట హత్యల కేసు.. పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పల్నాడు జంట హత్యల కేసులో వారు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ముందస్తు బెయిల్ కోసం రెండు పిటిషన్లు దాఖలు చేయగా.. వారిద్దరికీ ముందస్తు బెయిల్ పొందే అర్హత లేదని జస్టిస్ సందీప్ మెహతా తెలిపారు. గతంలో అరెస్టుపై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సైతం ఎత్తివేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో సరెండర్ అయ్యేందుకు సమయం కావాలని పిన్నెల్లి సోదరుల తరపు న్యాయవాది కోర్టును కోరారు.
ఈ ఏడాది మే24న గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య, అతని సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావు తెలంగాణలో హుజూర్ నగర్ జిల్లాలో ఒక పెళ్లికి అటెండై బైక్ పై గ్రామానికి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో ఆరోజు సాయంత్రం 5 గంటల సమయంలో వెల్దుర్తి మండలం బొదిలవీడు వద్ద వారిని ఒక స్కార్పియో వాహనం ఢీ కొట్టింది. స్పాట్ లో మొద్దయ్య చనిపోగా.. కొనఊపిరితో ఉన్న కోటేశ్వరరావును రాయితో మోది చంపినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం స్కార్పియోను వదిలి పరారయ్యారు.
టీడీపీకి చెందిన వీరిద్దరి మరణంపై తనకు అనుమానాలున్నాయని స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదయింది. మొత్తం ఏడుగురిపై కేసు నమోదవ్వగా.. ఏ-1 గా జవిశెట్టి శ్రీను, ఏ-2గా తోట వెంకట్రావ్, ఏ-3గా తోట గురవయ్య, ఏ-4గా నాగరాజ్, ఏ-5గా తోట వెంకటేశ్వర్లు ఉన్నారు. ఇందులో ఏ-6గా మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ-7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని చేర్చారు. దీంతో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి బ్రదర్స్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా సుప్రీంకోర్టు వారి పిటిషన్ ను కొట్టివేసింది.






