- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రి కారుమూరికి బిగ్ షాక్.. చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ మూవీ దేశ వ్యాప్తంగా రేపు విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ మూవీ దేశ వ్యాప్తంగా రేపు విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తణుకులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వర రావుకు ఊహించని షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే.. కారుమూరి వెంకట నాగేశ్వర రావు కుమారుడు, సునీల్ కుమార్ (Sunil Kumar) మంగళవారం పవన్ కళ్యాణ్‌పై చేసిన కామెంట్స్‌తో జన సైనికులు మండిపడ్డారు. అయితే, ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) ఆడియో ఫంక్షన్‌లో పవన్ తమ ప్రభుత్వం వచ్చిందని.. కావాల్సిన టికెట్ రేట్లను పెంచుకున్నామంటూ గొప్పలు చెబుతున్నారని కారుమూరి సునీల్ కామెంట్ చేశారు. సినిమా టికెట్లు అమ్ముకుంటే ఎవరి కడుపు నిండుతుందని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో సామాన్యులను పట్టించుకోవడం లేదని.. కేవలం కార్పొరేట్లకే పెద్దపీట కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కారుమూరి సునీల్ ఆరోపించారు. దీంతో అదును చూసి తణుకు చౌరస్తాలో మాటు వేసిన పవన్ ఫ్యాన్స్, జన సైనికులు అటుగా వెళ్తున్న కారుమూరి వెంకట నాగేశ్వర రావు కాన్వాయ్‌ని ఒక్కసారిగా చుట్టుముట్టారు. అనంతరం జనసేన జండాలు చేతబట్టి ఆయన వాహనంపైకి ఎక్కి డాన్సులు చేశారు. రేపు ‘హరిహర వీరమల్లు’ మూవీ విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.






