- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటుడు విజయ్ దేవరకొండకు బిగ్ షాక్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన గిరిజనులు
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన కింగ్‌డమ్ మూవీ(Kingdom Movie) జులై 31వ తేదీన విడుదల కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన కింగ్‌డమ్ మూవీ(Kingdom Movie) జులై 31వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇవాళ తిరుపతి వేదికగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో కింగ్‌డమ్ మూవీ యూనిట్‌కు అనూహ్య షాక్ తగిలింది. గతంలో విజయ్ దేవరకొండ గిరిజనులను(Tribals) ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. క్షమాపణ కూడా చెప్పలేదని స్థానిక గిరిజనులు మండిపడ్డారు. విజయ్ వ్యాఖ్యలకు నిరసగా ఇవాళ తిరుపతిలో నిర్వహించబోయే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని గిరిజన సంఘాలు హెచ్చరించాయి. ముఖ్యంగా గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చడాన్ని వారు తప్పు పట్టారు. దీంతో ట్రైలర్ విడుదల వేడుక వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మరో యువ నటుడు సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు.






