బిగ్ రిలీఫ్.. తీరం దాటిన తీవ్ర అల్పపీడనం

by Malleboina Mahesh |

బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.

బిగ్ రిలీఫ్.. తీరం దాటిన తీవ్ర అల్పపీడనం
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం (Severe low pressure) కారణంగా రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ (Department of Meteorology) అంచనా వేసింది. అయితే నిన్న రాత్రి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడకుండానే తీవ్ర అల్పపీడనం తీరం దాటినట్లు తెలిపారు. దీంతో ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్ కలిగింది.

ఆ అల్ప పీడనం ఉత్తర తమిళనాడు ప్రాంతంలో తీరం దాటినట్లు అధికారులు గుర్తించారు. అయినప్పటికీ ఈ రోజు ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు సూచించారు. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్‌లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అలర్ట్ జారీ చేయగా, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో విద్యాసంస్థలకు డీఈఓలు సెలవు ప్రకటించారు.

Next Story