AP News : ప్రభుత్వ ఉపాధ్యాయులకు బిగ్ రిలీఫ్

by Muthe.Rajitha |

ప్రభుత్వ ఉపాధ్యాయుల(Govt Teachers)కు ఏపీ ప్రభుత్వం(AP Govt) భారీ ఊరటనిచ్చింది.

AP News : ప్రభుత్వ ఉపాధ్యాయులకు బిగ్ రిలీఫ్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ ఉపాధ్యాయుల(Govt Teachers)కు ఏపీ ప్రభుత్వం(AP Govt) భారీ ఊరటనిచ్చింది. ఇకపై పాఠశాలల పనివేళల్లో విద్యాశాఖ అధికారులు ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని(No Meetings) ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్కూల్ టైమింగ్స్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు RJDSE, జిల్లా విద్యాధికారి(DEO), మండల విద్యాధికారులు ఎవరైనా సరే అత్యవసరం అయితే తప్ప ఎలాంటి సమావేశాలు పెట్టవద్దని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, జిల్లా పరిషత్ స్కూల్స్ హెడ్ మాస్టర్స్ తోగాని, సింగిల్ ప్రైమరీ స్కూల్స్ టీచర్స్, సిబ్బందితో గాని మీటింగ్స్ పెట్టకూడదని ఆదేశించింది.

స్కూల్ టైమింగ్స్ లో ఉపాధ్యాయులు సమావేశాల కోసం వెళితే విద్యార్థుల చదువుకు ఇబ్బంది అవుతుందని గుర్తించిన ఏపీ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుంటూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల విలువైన సమయం వదిలి సమావేశాల కోసం వెళితే, సిలబస్ సకాలంలో పూర్తవక అటు స్టూడెంట్స్, ఇటు టీచర్స్ ఇబ్బంది పడేవారని, ఇపుడు పూర్తి సమయం విద్యార్థుల కోసమే కేటాయించవచ్చని పేర్కొన్నారు.

Next Story