Posani Krishna Murali:నటుడు పోసానికి బిగ్ రిలీఫ్

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-10 08:59:19  IST  )

సీని నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి హైకోర్టు(AP High Court)లో ఊరట లభించింది.

Posani Krishna Murali:నటుడు పోసానికి బిగ్ రిలీఫ్
X

దిశ,వెబ్‌డెస్క్: సీని నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి హైకోర్టు(AP High Court)లో ఊరట లభించింది. నటుడు పోసాని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నేడు(గురువారం) హైకోర్టు విచారణ చేపట్టింది. తనపై నెల్లూరు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని దానిని క్వాష్ చేయాలని కోరుతూ పోసాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan)తో పాటు పలువురిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసాని పై కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజుల క్రితమే ఆయన బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సూళ్లూరుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలపై పోసాని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పోసాని పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిపిన న్యాయస్థానం కేసు పై తదుపరి చర్యలు నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. కేసులో విచారణ అధికారిగా ఉన్న మురళీ కృష్ణ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించారని సీరియస్ అయింది.

Next Story