- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవుల ప్రకటన
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వ విద్యార్థులకు తీపికబురుచెప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి (Sankranti) పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం (AP Government) విద్యార్థులకు తీపికబురుచెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులను ఖరారు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 10వ తేదీ నుంచి 18 వరకు అంటే ఏకంగా 9 రోజుల పాటు అన్ని సెలవులు ఇస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పండుగ తరువాత జనవరి 19 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సూచించారు. ఇక కళాశాలల సెలవులపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అటు తెలంగాణ (Telangana)లోనూ స్కూళ్లకు ఇవే తేదీల్లో సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. సంక్రాంతి పండుగ ఈ సెలవులు రావడం వల్ల విద్యార్థులు తమ సొంత ఊర్లకు వెళ్లడానికి, కుటుంబంతో గడపడానికి మంచి అవకాశం లభిస్తుంది.
Next Story






