- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BIG BREAKING: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై రాళ్ల దాడి.. తెనాలిలో పరిస్థితి ఉద్రిక్తం
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం సీఎం జగన్‌పై ఆగంతకులు ఆయనపై రాయి విసరగా ఆయన ఎడమ కనుబొమ్మకు గాయం అయింది. ఆ ఘటన మరువక ముందే తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. వారాహి యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి ఆయనపై రాయి విసరడం కలకలం రేపింది. అయితే, ఆ రాయి పవన్‌కు తృటిలో తప్పడంతో పెను ప్రమాదం తప్పింది. దాడికి పాల్పడిన వ్యక్తిని అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలు అదుపులోకి తీసుకుని పోలీసులకు హ్యాండోవర్ చేశారు.
Next Story






