Group-2 Mains:గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. హాల్‌టికెట్లు విడుదల

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-13 12:23:48  IST  )

రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది.

Group-2 Mains:గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. హాల్‌టికెట్లు విడుదల
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల హాల్‌టికెట్లను ఇవాళ(గురువారం) విడుదలయ్యాయి. అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://applications-psc.ap.gov.in/Download_HallTickets/ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ OTPR ID, పాస్‌వర్డ్, కాప్చా ఎంటర్ చేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. ఈ నెల 23న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించారు.

గ్రూప్-2 మెయిన్స్(Group-2 Mains) పరీక్ష జనవరి 5వ తేదీన నిర్వహించాలని APPSC నిర్ణయించింది. ఈ మేరకు పరీక్ష తేదీని సైతం ఖరారు చేసింది. కానీ సిలబస్ మార్పుతో పాటు పూర్తి స్థాయి సన్నద్ధత కోసం మరింత గడువు కావాలని అభ్యర్థులు APPSCని కోరారు. దీంతో ఈ పరీక్ష తేదీని ఫిబ్రవరి 23వ తేదీకి మార్చారు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు 92, 250 మంది అర్హత సాధించారు. ఏపీలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి 2023, APPSC డిసెంబర్ 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 905 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.

Next Story