TTD: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ సేవలు రద్దు!?

by Jakkula Mamatha |
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ సేవలు రద్దు!?
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో భక్తులు(Devotees) ప్రత్యేక భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే.. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. రాత్రి 7 నుంచి 9 గంట‌ల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.

అయితే.. ఈ సంవత్సరం తిరుమల(Tirumala)లో శ్రీవారికి నిర్వహించబోయే పౌర్ణమి గరుడసేవ పూర్తి వివరాలతో కూడిన క్యాలెండర్‌ను టీటీడీ(TTD) అధికారులు తాజాగా విడుదల చేశారు. దీని ప్రకారం.. ఈ ఏడాది మొత్తం మూడు సార్లు ఈ ఉత్సవాలు రద్దయినట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించిన తేదీలను టీటీడీ అధికారులు ఈ క్యాలెండర్‌లో వెల్లడించారు.

ఈ ఏడాది శ్రీవారి పౌర్ణమి గరుడసేవ వివరాలు..

ఈ ఏడాది తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గరుడ వాహన సేవలు పౌర్ణమి రోజుల్లో క్రింది తేదీలలో జరగనున్నాయి.

గరుడ వాహన సేవ నిర్వహించే తేదీలు..

1.⁠ ⁠12-05-2025 (సోమవారం)

2.⁠ ⁠10-07-2025 (గురువారం)

3.⁠ ⁠09-08-2025 (శనివారం)

4.⁠ ⁠07-10-2025 (మంగళవారం)

5.⁠ ⁠05-11-2025 (బుధవారం)

గరుడ వాహన సేవ రద్దు అయిన తేదీలు మరియు కారణాలు..

1.⁠ ⁠11-06-2025 (బుధవారం) – జ్యేష్ఠాభిషేకం (మూడవ రోజు)

2.⁠ ⁠07-09-2025 (ఆదివారం) – చంద్రగ్రహణం

3.⁠ ⁠04-12-2025 (గురువారం) – కార్తీక దీపోత్సవం.

Next Story

Most Viewed