కొత్త టీచర్లకు బిగ్ అలర్ట్.. సెలవులపై సర్కార్ కీలక ఉత్తర్వులు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో మెగా డీఎస్సీ (Mega DSC) ద్వారా రిక్రూట్ అయిన కొత్త టీచర్లకు తాజాగా సెలవులపై విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్త టీచర్లకు బిగ్ అలర్ట్.. సెలవులపై సర్కార్ కీలక ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మెగా డీఎస్సీ (Mega DSC) ద్వారా రిక్రూట్ అయిన కొత్త టీచర్లకు తాజాగా సెలవులపై విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 3న వారు విధుల్లో చేరగా.. డిసెంబర్ వరకు వర్తించే ప్రొపోర్షనేట్ సెలవులను వెల్లడించింది. అందులో క్యాజువల్ లీవ్స్ (CL), ఒక ఆప్షనల్ హాలిడే (OH), రెండు స్పెషల్ క్యాజువల్ లీవ్స్ (SPL), మహిళా ఉపాధ్యాయినులకు గాను ఒక స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను వినియోగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఇటీవల విద్యాశాఖలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాల భర్తీని కూటమి సర్కార్ పరిపూర్ణంగా చేసింది. మెగా డీఎస్సీ ద్వారా ఇప్పటికే 15,941 మంది కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరి పిల్లలకు పాఠాలు బోధిస్తున్న విషయం తెలిసిందే.

Next Story