మామిడి రైతులకు డబ్బులు రాలేదా..అయితే ఇలా చేయండి

by velandi.Saikiran |

లబ్ధిదారులైన రైతుల ఖాతాలలో 172.84 కోట్లు జమ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఈ రెండు జిల్లాల్లో దాదాపు 37,831 మంది

మామిడి రైతులకు డబ్బులు రాలేదా..అయితే ఇలా చేయండి
X

దిశ‌, వెబ్ డెస్క్ : మామిడి రైతులకు ఏపీ సర్కార్ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. కష్టాల్లో ఉన్న చిత్తూరు, తిరుపతి జిల్లాలోని తోతాపురి మామిడి రైతులకు కిలోకు నాలుగు రూపాయల చొప్పున అదనంగా డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఇందులో భాగంగానే తాజాగా లబ్ధిదారులైన రైతుల ఖాతాలలో 172.84 కోట్లు జమ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఈ రెండు జిల్లాల్లో దాదాపు 37,831 మంది లబ్ధి పొందారు.

అయితే డబ్బులు వేసిన తర్వాత, కొంత మంది రైతులకు డబ్బులు రాలేదని ఆందోళన చెందుతున్నారు. అయితే అలాంటివారు ఆందోళన చెందాల్సిన పనిలేదని కలెక్టర్లు కీలక ప్రకటన చేశారు. మామిడి డబ్బులు అందకపోతే, తమకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. డబ్బులు అందని రైతులు ఆర్ఎస్కే, మండల, జిల్లాస్థాయి ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలని పలు సూచనలు చేశారు కలెక్టర్లు. అలాంటి వాళ్ల నుంచి దరఖాస్తులు తీసుకొని లబ్ధిదారులకు డబ్బులు వేస్తామని కూడా స్పష్టం చేశారు. ఇక మామిడి రైతుల‌కు డ‌బ్బులు రావ‌డంపై ఏపీ మాజీ మంత్రి రోజా స్పందించారు. వైసీపీ పోరాటం వ‌ల్లే, మామిడి రైతుల‌కు న్యాయం జ‌రిగింద‌ని పేర్కొన్నారు.

Next Story