తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు బిగ్ అలర్ట్

by Malleboina Mahesh |

ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా గత రెండు రోజులు తిరుమల తిరుపతి కొండపై భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా గత రెండు రోజులు తిరుమల తిరుపతి కొండపై భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినప్పటికి తిరుమల శ్రీవారిని దర్శించుకు భక్తుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ రోజు ఉదయం శ్రీవారి దర్శనానికి 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. నిన్న ఒక్కరోజు శ్రీవారిని 73,853 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 22,551 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. దీంతో తిరుమలకు 3.47 కోట్ల హుండీ ఆదాయం వచ్చి చేరింది.

ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల

నేటి నుంచి ఆన్ లైన్‌లో జనవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు, రేపు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. అలాగే ఈ నెల 25 ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Next Story