Heavy Rain: భక్తులకు బిగ్ అలర్ట్.. సింహాచలంలో మళ్లీ భారీ వర్షం

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-30 11:49:28  IST  )

విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు.

Heavy Rain: భక్తులకు బిగ్ అలర్ట్.. సింహాచలంలో మళ్లీ భారీ వర్షం
X

దిశ,వెబ్‌డెస్క్: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలి వచ్చారు. ఈ క్రమంలో ఇవాళ(బుధవారం) సింహాచలం(Simhachalam)లో మళ్లీ భారీ వర్షం కురుస్తుంది. నిన్న(మంగళవారం) కురిసిన భారీ వర్షాని(Heavy rain)కి ఆలయంలోని గోడ కూలింది. ఈ క్రమంలో ఏడుగురు భక్తుల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ కూడా భారీ వర్షం కురుస్తుంది. అయితే వర్షంలోనూ భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి నిజరూప దర్శనం కోసం క్యూలైన్లలో అధిక సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు సూచించారు.

ఇక, సింహాచలంలో నిన్న(మంగళవారం) అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఈ తరుణంలో సింహాచలం బస్టాండ్ నుంచి పైకి వెళ్లే దారిలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర రూ.300 టికెట్ క్యూ లైన్ పై సిమెంట్ గోడ కూలింది. దీంతో శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు(Devotees) మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో వెంటనే NDRF సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

Next Story