అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-10 15:45:06  IST  )

అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి.

అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. 1:20 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని.. ఈ మేరకు జూన్ 23 నుంచి 30 వరకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. కాగా, మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ పరీక్షలను ఏపీపీఎస్సీ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లోని మొత్తం 13 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. అందులో విశాఖలో 2, విజయవాడలో 6, తిరుపతిలో 3, అనంతపురంలో 2 పరీక్షా కేంద్రాలను ఉన్నాయి. మెయిన్స్‌కు 4,496 మంది అభ్యర్థులు హాజరు కాగా.. అందులో విశాఖపట్నంలో 1190 మంది, విజయవాడలో 1801 మంది, తిరుపతిలో 911 మంది, అనంతపురంలో 594 మంది చొప్పున అభ్యర్థులు పరీక్షలు రాశారు. మొత్తం 89 గ్రూప్-1 పోస్టులకు గాను గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్ నిర్వహించిన విషయం విదితమే. అయితే, కేవలం నెల రోజుల్లోనే ఏపీపీఎస్సీ ఫలితాలను విడుదల చేయడం పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story