- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త రేషన్ కార్డులు.... ఇక ఆ ఫారం లేకున్నా అప్లై చేసుకోవచ్చు !
ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే వారికి బిగ్ అలర్ట్. మ్యారేజ్ సర్టిఫికెట్ లేకుండా... రేషన

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే వారికి బిగ్ అలర్ట్. మ్యారేజ్ సర్టిఫికెట్ లేకుండా... రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన చేశారు. ఏపీలో మే 8వ తేదీ నుంచి రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించి... తగిన వివరాలు అందించి రేషన్ కార్డు కోసం జనాలు అప్లై చేసుకుంటున్నారు. గురువారం రోజు నుంచి జన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా కూడా రేషన్ కార్డు సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఇక ఈ రేషన్ కార్డుల విషయంలో తాజాగా మరో కీలక అప్డేట్ వచ్చింది. కొత్తగా పెళ్లయిన జంటలు లేదా... ఒక కుటుంబంలో ఉంటూ వేరు కాపురం వెళ్లినవారు... తమ కార్డులను విభజించుకోవాలని అనుకుంటూ కొత్త కార్డులకు అప్లై చేస్తున్నారు. అలాంటి వాళ్ల కోసం స్పిల్టింగ్ అవకాశం అందిస్తోంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. అయితే ఇలా స్పిల్టింగ్ చేస్తే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం ఉండేది. కానీ ఇకపై వివాహ దృవీకరణ పత్రం లేకుండానే... స్పిల్టింగ్ కు అవకాశం కల్పిస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో కొత్తగా పెళ్లయిన వారికి ఊరట లభించనుంది.






