- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మండుతోన్న ఏపీ...నేడు ఈ 40 ప్రాంతాలకు తీవ్ర వడగాలులు
ఎండల తీవ్రత రోజుకు పెరుగుతోందని.. ఇలాంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ అథారిటీ ఎండీ ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజుకు పెరుగుతోందని.. ఇలాంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని AP విపత్తు నిర్వహణ అథారిటీ ఎండీ ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు. ఇవాళ అధిక ఉష్ణోగ్రతలతో పాటు 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని హెచ్చరించారు. మరో 21 మండలాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
విజయనగరం జిల్లాలోని బాడంగి,బొబ్బిలి,రామభద్రాపురం, తెర్లాం,వంగర మండలాలకు తీవ్ర వడగాలులు ఉంటాయని వెల్లడించారు. మన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మ లక్ష్మీపురం, జియ్యమ్మ వలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట,పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రకటించారు. సోమవారం మార్కాపురం జిల్లా కంభంలో 45.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైనట్లు తెలిపారు. మొత్తం 28 జిల్లాలకు గాను 20 జిల్లాల పరిధిలోని 227మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండి 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు.






