- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Biryani Sales: బిర్యానీతో పాత ఏడాదికి ఘన వీడ్కోలు.. ఆ జిల్లాలో రూ.6 కోట్లకు పైగా లాగించేశారు!
కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతూ, పాత ఏడాదికి వీడ్కోలు చెప్పే క్రమంలో ఏపీలోని బాపట్ల జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి సంబరాలు అంబరాన్ని తాకాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతూ, పాత ఏడాదికి వీడ్కోలు చెప్పే క్రమంలో ఏపీలోని బాపట్ల జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి సంబరాలు అంబరాన్ని తాకాయి. సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పట్టణాలు, గ్రామాల్లో ఆనందోత్సాహాల వాతావరణం నెలకొంది. ముఖ్యంగా యువత, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు కేకులు, బిర్యానీలతో కొత్త ఏడాదిని ఘనంగా ఆహ్వానించారు.
ఒక్కో బిర్యానీ సగటు ధర రూ.100
బాపట్ల జిల్లాలో మొత్తం 12.75 లక్షల జనాభా ఉండగా, కొత్త సంవత్సరం వేడుకల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు బిర్యానీ రుచి చూసినట్లు అంచనా. కనీసం 6 లక్షల మంది బిర్యానీ కొనుగోలు చేసినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో బిర్యానీ సగటు ధర రూ.100గా లెక్కిస్తే, కేవలం బిర్యానీలకే దాదాపు రూ.6 కోట్ల వ్యయం జరిగినట్లు తెలుస్తోంది.
బిర్యానీ సెంటర్లు రద్దీతో కిటకిట..
అదే కాకుండా కేకులు, కూల్ డ్రింక్స్, స్నాక్స్, హోటళ్లలో ప్రత్యేక విందులు, పార్టీ హాల్స్ వంటి వాటిపై అదనంగా భారీగా ఖర్చు జరిగినట్లు సమాచారం. న్యూ ఇయర్ సందర్భంగా హోటళ్లు, బిర్యానీ సెంటర్లు రద్దీతో కిటకిటలాడాయి. మొత్తానికి కొత్త సంవత్సరం జిల్లాకు ఆనందంతో పాటు కోట్ల రూపాయల వ్యాపారాన్ని కూడా తెచ్చిపెట్టింది. న్యూ ఇయర్ వేళ జిల్లా వాసులు బిర్యానీలతో పాత ఏడాదికి ఘన వీడ్కోలు పలికారు.






