‘అది వారి భ్రమ’.. కేసు నమోదు కావడం పై భూమన స్పందన

by Jakkula.Mamatha |

టీటీడీ ఎస్వీ గోశాలపై భూమన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

‘అది వారి భ్రమ’.. కేసు నమోదు కావడం పై భూమన స్పందన
X

దిశ,వెబ్‌డెస్క్: టీటీడీ ఎస్వీ గోశాలపై భూమన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) పై తిరుపతి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. టీటీడీ(TTD) ఎస్వీ గోశాల పై భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేశారని, భక్తుల మనోభావాలు దెబ్బ తీశారని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశాడు. దీంతో భూమన పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో తనపై కేసులు నమోదు కావడం పై తాజాగా భూమన స్పందించారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన మాట్లాడుతూ.. ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ క్రమంలో ఇలాంటి వంద కేసులు పెట్టిన తాను భయపడబోనని స్పష్టం చేశారు. ప్రభుత్వ తప్పులను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటానని భూమన తేల్చి చెప్పారు. వ్యక్తిత్వ హననం చేస్తే తాను వెనక్కి తగ్గుతాననుకుంటే అది వారి భ్రమ అని మాత్రమే అని తెలిపారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో టీటీడీ అప్రదిష్టపాలైందని దుయ్యబట్టారు.

Next Story