- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో పోలీసుల వ్యవహారంపై భూమన రియాక్షన్..ఇకనైనా కళ్ళు తెరవండి..!
తిరుమల ( Tirumala) శ్రీవారి సన్నిధిలో ముగ్గురు పోలీసులు (Police) హల్చల్ చేసిన సంఘటనపై వైసిపి నాయకులు భూమన కరుణాకర్

దిశ, వెబ్ డెస్క్: తిరుమల ( Tirumala) శ్రీవారి సన్నిధిలో ముగ్గురు పోలీసులు (Police) హల్చల్ చేసిన సంఘటనపై వైసిపి నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి ( Bhumana Karunakar Reddy) స్పందించారు. ఇకనైనా కళ్ళు తెరవండి అంటూ టిడిపి కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు భూమన. తాజాగా తిరుమలలో తాగి వచ్చి ముగ్గురు పోలీసులు హల్చల్ చేశారు. తిరుమలలోని రెండో ఘాట్ రోడ్డులో తాగి వచ్చిన ముగ్గురు కానిస్టేబుళ్లు పలు వాహనాలను ఢీకొట్టారు.
ఈ ముగ్గురు కానిస్టేబుళ్లు కర్నూలు జిల్లాకు సంబంధించిన ఓంకార్ నాయక్, షేక్ సరావుద్దీన్ , రాజశేఖర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురిని టీటీడీ విజిలెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించిన వారిపై కేసు కూడా నమోదు చేశారు. ఇక ఈ సంఘటనపై తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో అనేక అపచారాలు జరిగాయని గుర్తు చేశారు. తాజాగా పోలీసులే విచ్చలవిడిగా తాగి... రచ్చ చేశారని ఫైర్ అయ్యారు.
ఈ విషయంలో కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని... వాళ్ల తప్పిదం వల్ల ఇలా పోలీసులు కూడా రెచ్చిపోయారని మండిపడ్డారు. గత ప్రభుత్వ తప్పిదాలను చూపించడం తప్ప.... కూటమి చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. ఇకనైనా తిరుమల విషయంలో.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. హిందువులను అవమానించే తరహాలో కూటమి వ్యవహరించకూడదని వార్నింగ్ ఇచ్చారు వైసిపి నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి.






