- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నక్సలైట్లను గాలించినట్లుగా వైసీపీ నేతలను గాలిస్తున్నారు..ఎస్పీపై భూమన ఫైర్
చిత్తూరు ఎస్పీ వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు ఎస్పీ వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చినట్టుగా ఇచ్చి విపరీతమైన ఆంక్షలు విధిస్తూ నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. నక్సలైట్లను గాలించినట్టుగా వైసీపీ నేతలు, కేడర్ ను పోలీసులు గాలించి వేధిస్తున్నారని అన్నారు. లా అండ్ ఆర్డర్ బూచిగా చూపిస్తూ పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నామన్నారు. ఎస్పీ రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని బెదిరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటను అడ్డుకుంటామన్న టీడీపీ ఎమ్మెల్యేలను ఎస్పీ ఎందుకు హెచ్చరించలేదని ప్రశ్నించారు. ఎస్పీ రైతులను, వైసీపీ నేతలను బెదిరించడం చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం వస్తుందన్నారు. పంటలను లారీల్లో మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని, వాటిని రోడ్డుపై పారేసి నిరసన తెలిపితే ఊరుకునేది లేదని ఎస్పీ హెచ్చరించడం ఏంటని ప్రశ్నించారు. ఎస్పీ రాజకీయంగా మాట్లాడటం వెనుక చంద్రబాబు డైవర్షన్ ఉందని ఆరోపించారు.






