భూమన మనిషి కాదు.. ఓ సైతాన్: టీటీడీ బోర్డు మాజీ మెంబర్ ఓవీ రమణ

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-18 09:15:37  IST  )

భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) మనిషి కాదని.. ఓ సైతాన్ అని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ మెంబర్ ఓవీ రమణ (OV Ramana) తీవ్ర ఆరోపణలు చేశారు.

భూమన మనిషి కాదు.. ఓ సైతాన్: టీటీడీ బోర్డు మాజీ మెంబర్ ఓవీ రమణ
X

దిశ, వెబ్‌డెస్క్: భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) మనిషి కాదని.. ఓ సైతాన్ అని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ మెంబర్ ఓవీ రమణ (OV Ramana) తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ (TTD)పై భూమన చేసే బూటకపు ఆరోపణలను ఎవరూ నమ్మవద్దని అన్నారు. అలిపిరి (Alipiri)లో ఉన్నది విగ్రహం కాదని.. అది కేవలం శిల మాత్రమేనని అన్నారు. ఒక వేళ ఆ శిలను మహా విష్ణువుగా భావిస్తే భూమన తన ఇంటికి తీసుకెళ్లి ప్రతిష్టించుకోవాలని కామెంట్ చేశారు. రాజకీయ అవసరాలు, అవకాశాల కోసమే టీటీడీని వాడుకుంటున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన టీటీడీ చైర్మన్‌గా ఉన్న నాడు ఎలాంటి దారుణాలు చేశారో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. భూమనను దూరం పెట్టాలని జగన్‌కు సూచిస్తున్నానని ఓవీ రమణ అన్నారు.

Next Story