Bhumana: అర్ధరాత్రి నుంచే నన్ను నిర్భంధించారు.. భూమన సంచలన ఆరోపణలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-17 08:25:53  IST  )

టీటీడీ (TTD) ఎస్వీ గోశాల (SV Gosala)లో గత మూడు నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Bhumana: అర్ధరాత్రి నుంచే నన్ను నిర్భంధించారు.. భూమన సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీటీడీ (TTD) ఎస్వీ గోశాల (SV Gosala)లో గత మూడు నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న కూటమి సర్కార్ భూమనను స్వయంగా టీటీడీ ఎస్వీ గోశాలను వచ్చి సందర్శించాలని తెలిపింది. దీంతో ఇవాళ ఉదయం ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, వైసీపీ కార్యకర్తలతో కలిసి ఎస్వీ గోశాలకు బయలుదేరిన భూమనను పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో వైసీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం భూమన మీడియాతో మాట్లాడుతూ.. గోశాలకు వస్తే చినిపోయిన గోవులు ఇప్పుడు కనిపిస్తాయా అని ప్రశ్నించారు. మొత్తం ఎన్ని గోవులు చనిపోయాయో తెలియాలంటే.. పాతిపెట్టినవి తవ్వి బయటకు తీయాలని డిమాండ్ చేశారు. తాను గోశాలకు వస్తున్నా.. అని ప్రకటించగానే నిన్న అర్ధరాత్రి నుంచే తనను ఇంట్లో నిర్భంధించారని ఫైర్ అయ్యారు. టీడీపీ (TDP) సవాలును స్వీకరించి తాను వస్తానంటే రానివ్వట్లేదని అరోపించారు. ఈ విషయంలో తాను రేపు అయినా.. ఎల్లుండి అయినా గోశాలకు రావడానికి సిద్ధమని భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు.

Next Story