- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. NHAI అధికారులపై అఖిల ప్రియ ఆగ్రహం
నంద్యాల జిల్లా బస్సు ప్రమాదంపై భూమా అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా(Nandyala District) శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట(Sirivellametta) వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు(Private Travels Bus) దగ్ధం అయిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. బస్సు టైరు పగలడంతో రహదారికి అవతలివైపు ఎదురుగా వస్తున్న లారీ(Lorry)ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇద్దరు డ్రైవర్లతో సహా లారీ క్లీనర్ మృతి చెందారు. అయితే ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ(MLA Bhuma Akhilapriya) పరిశీలించారు. ఎన్‌హెచ్ఏఐ అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌హెచ్ఏఐ అధికారిని ఘటనా స్థలాన్ని చూపించి వరుస రోడ్డు ప్రమాదాలపై నిలదీశారు. ఇలాంటివి మరోసారి పునరావృతమైతే నిరసనకు దిగుతామని హెచ్చరించారు. జాతీయ రహదారి నిర్వహణ సరిగా లేదని అఖిల ప్రియ మండిపడ్డారు.
Next Story






