- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిసెంబర్ 26 కల్లా భోగాపురం విమానాశ్రయం పూర్తి : మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
భోగాపురం విమానాశ్రయ నిర్మాణం ఈ ఏడాది డిసెంబరునాటికల్లా పూర్తవుతుందని మంత్రి బీసీ జనార్ధన్ స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: భోగాపురం విమానాశ్రయాన్ని కూటమి ప్రభుత్వం హైజాక్ చేసిందంటూ వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు మండలిలో విమర్శించారు. విమానాశ్రయం పనులపై ఆయన అడిగిన ప్రశ్నకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం ఎయిర్ పోర్టును హైజాక్ చేసిందన్న విమర్శలను మంత్రి ఖండించారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చింది టీడీపీనే అని స్పష్టం చేశారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టును టీడీపీ ప్రభుత్వం నిర్మిస్తే.. దానిని వైసీపీ హైజాక్ చేసిందని ఆరోపించారు. అలాగే ఏ సంబంధం లేని వైఎస్సార్ విగ్రహాన్ని తీసుకొచ్చి ఎయిర్పోర్టు వద్ద పెట్టడంపై అసహనం వ్యక్తం చేశారు. వెలుగొండ ప్రాజెక్ట్ విషయంలోనూ వైసీపీ నేతలు అలాగే ప్రవర్తించారన్నారు. ప్రాజెక్టును తాము నిర్మిస్తే వైసీపీ హైజాక్ చేసిందని విమర్శించారు. ఎవరు నిర్మించిన ప్రాజెక్టుల్ని ఎవరు హైజాక్ చేశారో ప్రజలకు బాగా తెలుసన్నారు.
భోగాపురం విమానాశ్రయాన్ని రూ.2300 కోట్ల వ్యయంతో పీపీపీ విధానంలో నిర్మిస్తున్నామని మంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వంలోనే 96 శాతం పనులు పూర్తయ్యాయని, ఈ ఏడాది డిసెంబర్ 26 నాటికి విమానాశ్రయ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల్ని తీసుకెళ్లేలా విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.






