- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భీమవరం డీఎస్పీ వ్యవహారం.. హోంమంత్రి, డీజీపీతో CM చంద్రబాబు భేటీ
Bhimavaram DSP affair.. CM Chandrababu meets Home Minister and DGP

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య అవినీతి వ్యవహారాలపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఇవాళ ఆయన హోంమంత్రి వంగలపూడి అనిత (Anitha), డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta)తో భేటీ అయ్యారు. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్న వారిపై, సివిల్ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్న వారిపై కఠిన చర్యలకు ఆదేశించారు. డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలి, ఇప్పటి వరకు చేసిన అక్రమాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
అదేవిధంగా నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన లక్ష్మీనాయుడు హత్యను సీఎం చంద్రబాబు ఖండించారు. లక్ష్మీనాయుడు (Lakshmi Nayudu) దారుణ హత్య అమానవీయం, అమానుషమని కామెంట్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి కేసు విచారణ వేగంగా జరిగేలా చూడాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశించారు. లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రభుత్వం తరఫున సీఎం పరిహారం ప్రకటించారు. మృతుడి భార్యకు రెండెకరాల భూమితో పాటు రూ.5 లక్షల నగదు, ఇద్దరు పిల్లలకు రెండెకరాల చొప్పున భూమితో పాటు రూ.5 లక్షల నగదు ఎఫ్‌డీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇక కారు దాడిలో గాయపడిన పవన్‌కు 4 ఎకరాలు, రూ.5 లక్షల నగదు, భార్గవ్‌కు రూ.3లక్షల పరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.






