20 ఏళ్లుగా ఆ విగ్రహం అక్కడే ఉంది : భూమనకు భానుప్రకాష్ రెడ్డి కౌంటర్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-16 07:42:54  IST  )

తిరుమలలో (Tirumala) ఘోర అపచారం జరిగిందంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) వాపోయారు.

20 ఏళ్లుగా ఆ విగ్రహం అక్కడే ఉంది : భూమనకు భానుప్రకాష్ రెడ్డి కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో (Tirumala) ఘోర అపచారం జరిగిందంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) వాపోయారు. తిరుమల కొండకు కాలినడకన వెళ్లే అలిపిరి (Alipiri) మార్గంలో శ్రీ మహావిష్ణువు విగ్రహం పడి ఉన్న దృశ్యాలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. మలమూత్ర విసర్జనలు, మద్యం బాటిళ్లను విసిరేస్తున్న ప్రదేశంలో స్వామివారి విగ్రహాన్ని ఇలా నిర్లక్ష్యంగా పడేశారంటూ టీటీడీపై (TTD) ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం గురించి చెప్పే కూటమి ప్రభుత్వం చేసే పనులివేనా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలపై టీటీడీ బోర్డు సభ్యుడు నేత భానుప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) స్పందించారు. ఆ విగ్రహం 20 ఏళ్లుగా అక్కడే ఉందని కౌంటరిచ్చారు. పట్టు కన్నయ్య అనే ఆచారి వద్దకు 20 ఏళ్ల క్రితం వచ్చి శనీశ్వరుడి విగ్రహం కోసం రూ.2 లక్షలు ఇచ్చారని తెలిపారు. శనీశ్వరుడి వాహనం కాకికి బదులుగా మరో ఆకారాన్ని చెక్కడంతో ఆ భక్తుడు విగ్రహాన్ని అక్కడే వదిలేశారని పేర్కొన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ఆ విగ్రహాన్ని మహావిష్ణువు విగ్రహం అని చెప్పటాన్ని భానుప్రకాష్ తప్పు పట్టారు. అది శనీశ్వరుడి విగ్రహమన్న విషయం గ్రహించి మాట్లాడాలని సూచించారు. గుడితాళాలకు, బండి తాళాలకు తేడా తెలియని వ్యక్తి భూమన అని విమర్శించారు. ఆయన టీటీడీ ఛైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఆ విగ్రహం అక్కడే ఉందని, ఆనాడు పూజలు చేయకుండా ఇప్పుడు అక్కడికి వెళ్లి ముసలి కన్నీరు ఎందుకు కారుస్తున్నారని ప్రశ్నించారు.

Next Story