- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: గతేడాది డిసెంబరులో విజయవాడ (Vijayawada) మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ హోటల్లో ఎండీఎంఏ డ్రగ్స్ (Drugs) సేవిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు హోటల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆ తనికీల్లో విజయవాడ నగరంలోని మధురానగర్ కు చెందిన వెంకట జగదీష్ కుమార్, సింగ్ నగర్ కు చెందిన అఖిలేష్ లను అరెస్టు చేశారు. ఇదే క్రమంలో నెల్లూరుకు చెందిన నిందితుడు రాజేశ్ పరారయ్యాడు. కేసులో నాలుగో నిందితుడైన మహేశ్ రెడ్డిని నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విజయవాడకు డ్రగ్స్ తీసుకొచ్చినప్పుడు గాయత్రినగర్ సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారించగా బెంగళూరుకు చెందిన ఓ యువతి పేరును బయటపెట్టాడు.
తాను బెంగళూరులో వేములపల్లి గ్రీష్మ (Vemulapalli Greeshma) అనే యువతి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు మహేశ్ రెడ్డి విచారణలో వెల్లడించాడని పోలీసులు తెలిపారు. అతనితో పాటు అతని స్నేహితులకు కూడా ఆమె గత కొన్నాళ్లుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. మహేశ్ ఫోన్ లో గ్రీష్మతో జరిగిన లావాదేవీలను పరిశీలించి వాటిని సేకరించామన్నారు. వాటి ఆధారంగా మహేశ్ తో పాటు అతని స్నేహితులకు గ్రీష్మ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. అయితే కేసులో ఆమె పేరును చేర్చినప్పటి నుంచి నిందితురాలు పరారీలో ఉందని తెలియజేశారు. నిందితురాలిని అరెస్టు చేసేందుకు బెంగళూరుకు (Bengaluru) ప్రత్యేక బృందాన్ని పంపామని ప్రకటించారు. గ్రీష్మను అరెస్టు చేసి విచారిస్తే డ్రగ్స్ నెట్వర్కుకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.






