- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వచ్చే నెలలో బీచ్ ఫెస్టివల్ : మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి
వచ్చే నెల జనవరి 2026లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాజంనేయ స్వామి అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : వచ్చే నెల జనవరి 2026లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాజంనేయ స్వామి అన్నారు. విశాఖ పట్నం అంటే సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక అభిమానం అన్నారు. అందుకే శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు తొమ్మిది జిల్లాలో విశాఖ ఎకనామిక రీజియన్ ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్రను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అనేక ప్రణాళికలను రూపొందించి వాటిని అమలు చేస్తున్నారన్నారు. శుక్రవారం విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలకు విశాఖ పట్నంలో సీఎంతో పాటు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపనలు చేశారని పేర్కొన్నారు. నూతన ఏడాది నూతనోత్సాహంతో విశాఖ వేదికగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పర్యాటక రంగాన్ని బలపరిచేందుకు, పర్యాటకులను ఆకట్టుకునేందుకు, ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను మెరుగుపరిచేందుకు ఈ ఫెస్టివల్ దోహద పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
పది లక్షల కోట్ల పెట్టబడులకు చర్యలు : పల్లా శ్రీనివాస రావు
విశాఖ ఎకనామిక్ రీజియన్ ద్వారా 2031 నాటికి పది లక్షల కోట్ల రూపాయల పెట్టబడులు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు తెలిపారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ తొలి సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిందన్నారు. 36 వేల చదరపు కిలోమీటర్లు పరిధిలో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఉందని పేర్కొన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో ఏడు గ్రోత్ సెక్టర్లు ఉంటాయన్నారు. రీజియన్ పరిధిలో 49 ప్రాజెక్టులు ఉంటాయన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి విశాఖ ఎకనామిక్ రీజియన్ సమీక్ష ఉంటుందని వివరించారు. కొందరు ప్రభుత్వానికి భూములు ఇవ్వకుండా ప్రజలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయాలు ప్రక్కన పెట్టి అభివృద్ధికి అందరూ సహకరించాలని హితవు పలికారు. వైసీపీ నాయకులు ఫేక్ ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ లో కన్వేయర్ బెల్ట్ రెండు సార్లు తెగిపోయిందని పేర్కొన్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేదా దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే సందేహాలు ఉన్నాయన్నారు. నివేదిక ఆధారంగా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పారు. కేంద్రాన్ని అతి కష్టంతో ఒప్పించి స్టీల్ ప్లాంట్ కు నిధులు తీసుకువచ్చామని తెలియజేశారు. రాష్ట్రం నుంచి కూడా నిధులు మంజూరయ్యాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో తాము ముందు ఉంటామన్నారు. యాజమాన్యం కార్మికులు ప్లాంట్ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.






