- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీవై పార్టీ అధ్యక్షుడి గన్ మెన్ బలవన్మరణం!
సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఇల్లు, గ్రామంలో విషాద ఛాయలు.

దిశ, వెబ్ డెస్క్ : ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ (CRPF Constable) ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనమయ్య జిల్లాలో పుంగనూరులో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం (Bukkaraya Samudram) మండలంకు చెందిన చెన్నా రెడ్డి (Chenna Reddy) సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. తన విధి నిర్వహణలో భాగంగా బీసీవై (BCY) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav) వద్ద వై ప్లస్ కేటగిరి గన్ మెన్ గా పని చేస్తున్నారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఆయన మరణించినట్లు పోలీసులకు సమాచారం అందింది. పుంగనూరులోని చెన్నారెడ్డి నివాసానికి వెళ్లి చూడగా అతను ఉరేసుకొని బలవన్మరణం చెందినట్లు పోలీసులు గుర్తించారు. పరిసరాలను పరిశీలించి ప్రాథమిక ఆధారాలను సేకరించారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే మరణానికి గల కారణాలు తెలియరాలేదు. మానసిక ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలేమైనా కారణం అయ్యుండొచ్చనే కోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మరణంతో అతని కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అతని ఆత్మహత్య పట్ల అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.






