BC Janardhan Reddy: సీఎం చంద్రబాబుకు ఆత్మీయ అభినందనలు

by Vemula.Srinu Prasad |

విజనరీ లీడర్, నవ్యాంధ్ర నిర్మాత,చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి నేటికీ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఆయనకు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆత్మీయ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు

BC Janardhan Reddy: సీఎం చంద్రబాబుకు ఆత్మీయ అభినందనలు
X

దిశ, వెబ్ డెస్క్: విజనరీ లీడర్, నవ్యాంధ్ర నిర్మాత,చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి నేటికీ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఆయనకు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆత్మీయ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి.. అసామాన్య రాజకీయనాయకుడిగా ఎదిగిన తీరు.. రాజకీయ రంగంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఒడిదుడుకులను ఎదుర్కొని ఆయన నిలిచి, ప్రజల మనస్సు గెలిచిన తీరు అనితరసాధ్యమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి నవ్యాంధ్ర పయనం వరకు.. అభివృద్ధి దిశలో వేసిన ప్రతి అడుగులోనూ చెరగని ముద్ర చంద్రబాబు సొంతమని బీసీ జనార్థన్ రెడ్డి చెప్పారు.

‘‘30 ఏళ్లలో 4 సార్లు ముఖ్యమంత్రిగా 15 ఏళ్లకు పైగా సీఎంగా ప్రజలు ఆయనకు అవకాశం కల్పించడం.. ఆయన పరిపాలన దక్షతపై రాష్ట్ర ప్రజలకున్న నమ్మకం, విశ్వాసాలకు నిదర్శనం. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైటెక్ సిటీ నిర్మాణం చేపట్టినా, నేడు అమరావతి నిర్మాణానికి నడుం కట్టిన అది విజనరీ లీడర్ చంద్రబాబుగారికి మాత్రమే సాధ్యం. సంక్షేమ – అభివృద్ధితో కూడిన సుపరిపాలన ప్రజలకు అందించడమే ఆయన నైజం. 30 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు.. తొలిసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి సరికొత్త సంస్కరణలతో ఉమ్మడి ఆంధ్రప్రదే ప్రదేశ్‌లో పరిపాలనదక్షకుడిగా తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎదిగిన వ్యక్తి చంద్రబాబునాయుడు. వరుస ఓటములకు వెన్ను చూపని నైజం.. సంక్షోభాలను సువర్ణ అవకాశాలుగా మలుచుకున్న వ్యక్తిత్వం చంద్రబాబు సొంతం. నాడు ఐటీ విప్లవం తీసుకొచ్చినా, నేడు పేద – ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం తగ్గించేందుకు P4 పథకాన్ని అమలు చేస్తున్నా.. అది చంద్రబాబు లాంటి విజనరీకి మాత్రం సాధ్యం. 20 ఏళ్ల క్రితం విజన్ 2020 అన్నా.. నేడు స్వర్ణాంధ్ర - 2047 అన్నా.. అదీ చంద్రబాబుగారి ముందు చూపుకు నిదర్శనం. ఈ 5 దశాబ్దాల అవిశ్రాంత సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి అడుగులో ఆయన చూపిన క్రమశిక్షణ, శ్రమ, నిరంత పోరాటం, సమర్థ నాయకత్వం సదా ఆదర్శప్రాయం.. స్ఫూర్తి ప్రదాయకం.’’ అని బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు.

Next Story