- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాపట్ల : బావిలో పడి బాలుడు మృతి
ప్రమాదమా లేక అనుమానాస్పదమా?

దిశ, వెబ్ డెస్క్ : బాపట్ల (Bapatla) జిల్లాలోని ధరివాడ కొత్తపాలెంలో (Kothapalem) విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలుడు బావిలో పడి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిట్ట శంకర్ రెడ్డి (Pitta Shankar Reddy) దంపతులకు సాయి (7) అనే కుమారుడు ఉన్నాడు. సోమవారం సాయంత్రం ఎప్పటిలాగే పిల్లలతో కలిసి ఆడుకున్నాడు. అయితే కాసేపటికి బాలుడు కనిపించకుండా పోయాడు. విషయం తెలుసుకున్న శంకర్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు సాయి కోసం వెతికారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మంగళవారం ఉదయం గ్రామంలో ఉన్న ఓ బావిలో సాయి (Sai) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారాన్ని పోలీసులకు అందించడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమారుడు మరణించాడనే విషయం తెలుసుకొని శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు గుండెలు అవిసెలా రోదించారు. వారితో పాటు స్థానికులు బాధకు లోనయ్యారు.
READ MORE ....






