పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-27 11:05:42  IST  )

గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏఆర్ కానిస్టేబుల్ కన్నయ్య (Kannayya) కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజులాగే తన విధులు ముగించుకుని విశ్రాంతి తీసుకుంటుండగా, నిద్రలోనే ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో కన్నయ్య నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఉదయం తోటి సిబ్బంది గమనించేసరికి ఆయన అప్పటికే విగతజీవిగా పడిఉన్నారు. విధి నిర్వహణలో ఎంతో చురుగ్గా ఉండే కన్నయ్య అకాల మరణం చెందడంతో పోలీసు శాఖలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతిపై తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

READ MORE ....

బాపట్ల : బావిలో పడి బాలుడు మృతి

Next Story