- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జిమ్‌లో వ్యాయామం చేస్తూ.. బ్యాంక్ ఉద్యోగి మృతి
జిమ్ చేసిన తర్వాత అస్వస్థతకు గురైన బ్యాంక్ ఉద్యోగి ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. ఈ విషాద ఘటన పలమనేరులో జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: జిమ్‌లో వ్యాయామం చేస్తూ అస్వస్థతకు గురైన బ్యాంక్ ఉద్యోగి.. ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడు. చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన ఈ సంఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విశ్వనాథ్ (27) వి.కోటలో ఉన్న డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఉదయం జిమ్ చేసిన తర్వాత అస్వస్థతకు గురవ్వగా.. జిమ్ లో ఉన్నవారు అతన్ని ఆస్పత్రికి తరలించారు. దారిమధ్యలోనే విశ్వనాథ్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. వీరరాఘవయ్య వీధిలో ఉంటోన్న విశ్వనాథ్ కు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అధిక వ్యాయామం కారణంగా విశ్వనాథ్ గుండెపోటుకు గురై మరణించినట్లు వైద్యులు భావిస్తున్నారు. విశ్వనాథ్ కు గతంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఇలా సడెన్ గా గుండెపోటు రావడం ఆశ్చర్యకరంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
కాగా.. ఇన్ స్టంట్ వెయిట్ లాస్ కోసం అదే పనిగా వ్యాయామం చేయడం చాలా డేంజర్ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫిట్నెస్ ఫ్రీక్స్ త్వరగా బాడీబిల్డింగ్ చేయాలని లిక్విడ్స్ తీసుకోకుండా ఓవర్ జిమ్ చేయడం కార్డియాక్ అరెస్ట్ కు దారితీస్తుందన్నారు.






